Vaccine: కరోనా వ్యాక్సిన్ రాకముందే 60 కోట్ల డోసులకు ఒప్పందం కుదుర్చుకున్న ట్రంప్!

  • వ్యాక్సిన్ రూపకల్పనలో ముందంజలో ఉన్న ఫైజర్
  • బయో ఎన్ టెక్ ఎస్ఈతో కలిసి కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి
  • 10 కోట్ల డోసులకు 200 కోట్ల డాలర్లు చెల్లించనున్న ట్రంప్ సర్కారు
Trump government signs for sixty crore vaccine doses in advance

ఓవైపు కరోనా రక్కసి మానవాళికి పెను విపత్తుగా మారి విలయం సృష్టిస్తుండగా, మరోవైపు ఈ వైరస్ ను కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం యుద్ధ ప్రాతిపదికన పరిశోధనలు సాగుతున్నాయి. ఓవైపు పరిశోధనలు జరుగుతుండగానే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 60 కోట్ల వ్యాక్సిన్ డోసులకు ముందుగానే ఒప్పందం కుదుర్చుకుని సంచలనం సృష్టించారు.

 ఫైజర్-బియోఎన్ టెక్ ఎస్ఈ భాగస్వామ్యంతో తయారవుతున్న వ్యాక్సిన్ కోసం అమెరికా ప్రభుత్వం ఆరాటపడుతోంది. డిసెంబరు కల్లా 10 కోట్ల డోసులు సరఫరా చేస్తే అమెరికా 200 కోట్ల డాలర్లు చెల్లించనుంది. ఆపై వాటి పనితీరు ఆధారంగా మరో 50 కోట్ల డోసుల కొనుగోలు ప్రక్రియ ఉంటుంది. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ, 'ఇక్కడా మేమే ముందంజలో నిలిచాం. నిర్ణీత కాలం కంటే ముందే వ్యాక్సిన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతర కంపెనీలు కూడా వ్యాక్సిన్ల పరిశోధనలలో మెరుగైన కృషి చేస్తున్నాయి' అని వివరించారు.

More Telugu News