Vaccine: కరోనా వ్యాక్సిన్ల రేసులో రష్యా ముందంజ.. రెడీ అవుతున్న నాలుగు వ్యాక్సిన్లు!

Russia prime minister says four vaccines proved safe for humans
  • ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు
  • రష్యాలో 26కి పైగా వ్యాక్సిన్లపై పరిశోధనలు
  • నాలుగు వ్యాక్సిన్లు అన్ని విధాలా సురక్షితం అంటున్న రష్యా ప్రధాని
కరోనా మహమ్మారిని నిలువరించే సమర్థవంతమైన వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. 200కి పైగా దేశాలు కరోనా వైరస్ ప్రభావంతో సతమతమవుతుండగా, 85 దేశాల్లో వ్యాక్సిన్ కోసం ముమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు నిర్వహిస్తున్న దేశాల్లో రష్యా కూడా ఉంది. రష్యాలోని ప్రభుత్వ రంగ సంస్థ గమాలెయ్ ఇన్ స్టిట్యూట్ తయారు చేసిన వ్యాక్సిన్ ఇప్పటికే కీలక దశలు అధిగమించి క్లినికల్ ట్రయల్స్ లోనూ అమోఘమైన ఫలితాలను ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, రష్యా నుంచి మరో మూడు వ్యాక్సిన్లు కూడా క్లినికల్ ట్రయల్స్ దశలోకి ప్రవేశించాయి.

దీనిపై రష్యా ప్రధాని మిఖాయిల్ మిషుస్తిన్ మాట్లాడుతూ, తమ దేశంలో 26 కంటే ఎక్కువ వాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయని, అందులో 4 వ్యాక్సిన్లు సురక్షితమైనవిగా భావిస్తున్నామని తెలిపారు. ఆ నాలుగు వ్యాక్సిన్లు మానవులపై ప్రయోగించేందుకు అనుకూలంగా ఉన్నాయని వివరించారు. త్వరలోనే క్లినికల్ ట్రయల్స్ పూర్తవుతాయని భావిస్తున్నామని మిషుస్తిన్ వెల్లడించారు.
Vaccine
Corona Virus
Russia
Clinical Trials
Prime Minister

More Telugu News