tapsi: కంగన, తాప్సీ మధ్య సయోధ్య కుదర్చాలని ప్రయత్నించా: దర్శకుడు అనురాగ్ కశ్యప్

anurag on tapsi kangana matter
  • ఆ ఇద్దరు హీరోయిన్లు నాకు మంచి స్నేహితులు
  • వారితో మాట్లాడాను .. అది వీలు కాలేదు 
  • కంగన పూర్తిగా మారిపోయినట్టు కనిపిస్తోంది  
హీరోయిన్లు కంగనా రనౌత్, తాప్సీ పరస్పరం విమర్శలు గుప్పించుకుంటోన్న విషయం తెలిసిందే. నెపోటిజం గురించి వ్యాఖ్యలు చేస్తూ తాప్సీ, స్వరా భాస్కర్ లాంటి హీరోయిన్ల‌ను బీ గ్రేడ్‌ అని కంగన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. దీనిపై స్పందించిన తాప్సీ కూడా దీటుగా సమాధానం ఇచ్చింది. వారి మధ్య మాటల తూటాలు పేలుతోన్న సమయంలో తాను ఇందులో జోక్యం చేసుకున్నానని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ చెప్పాడు.

ఆ ఇద్దరు హీరోయిన్లు తనకు మంచి స్నేహితులని చెప్పాడు. వారి మధ్య వివాదం ప్రారంభమైన తొలి రోజుల్లో తాను వారితో మాట్లాడానని చెప్పాడు. వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ఉద్దేశంతో తాను ప్రయత్నం చేశానని, అయితే, అది వీలుకాలేదని చెప్పుకొచ్చాడు. తాను ఇటీవల కంగనా రనౌత్ ఇచ్చిన ఇంటర్వ్యూ చూశానని, ఆమె మాటలు విన్నానని చెప్పాడు. గతంలో ఆమె తనకు మంచి స్నేహితురాలని, ప్రస్తుతం పూర్తిగా మారిపోయి కనపడుతోన్న ఈ కొత్త కంగన ఎవరో తనకు తెలియదని ఆయన వ్యాఖ్యానించాడు.
tapsi
kangana ranaut
Bollywood

More Telugu News