Ganta Srinivasa Rao: వైసీపీలో చేరనున్న గంటా.. జగన్ నుంచి క్లియరెన్స్?

Ganta Srinivasa Rao to join YSRCP
  • జగన్ సన్నిహితులతో ముగిసిన చర్చలు
  • అడ్డు చెపుతున్న విజయసాయి, అవంతి
  • సుముఖంగా ఉన్న జగన్

తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలబోతున్నట్టు తెలుస్తోంది. సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరబోతున్నారని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే రంగం సిద్ధమైందని చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ కు సన్నిహితులైన వ్యక్తులతో చర్చలు ముగిశాయని... వైసీపీలో గంటా చేరికకు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని గంటా సన్నిహితులు కూడా చెపుతున్నారు.

ఆగస్ట్ 15వ తేదీన పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే రోజున వైసీపీలో గంటా చేరనున్నట్టు సమాచారం. మరోవైపు గంటా చేరికపై విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్ అసంతృప్తిగా ఉన్నారని... అయినప్పటికీ జగన్ సుముఖంగా ఉన్నారని చెపుతున్నారు. రానున్న రోజుల్లో దీనిపై పూర్తి క్లారిటీ రానుంది. ఒకవేళ ఇదే నిజమైతే... టీడీపీకి భారీ షాక్ తగిలినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News