Nara Lokesh: 'ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు' అంటూ ఓ వీడియో పోస్ట్ చేసిన లోకేశ్

  • అవసరానికి మించి బెడ్లు ఏర్పాటు చేశామని జగన్ అంటున్నారు
  • బెడ్లు లేవని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
  • మన్మథ రెడ్డి అనే యువకుడికి వైద్యం అందని పరిస్థితి
  • ఇప్పటికైనా జగన్ రెడ్డి కళ్లు తెరవాలి 
lokesh shares corona victims video

కరోనాకు చికిత్స చేయించుకోవడానికి ఆసుపత్రిలో బెడ్లు కూడా లేవంటూ కరోనా బాధిత యువకుడు ఒకరు కన్నీరు పెట్టుకున్నాడు. తన తల్లితో పాటు తాను కరోనా బారిన పడితే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవట్లేదని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు.  

'అవసరానికి మించి బెడ్లు ఏర్పాటు చేశామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ గారు అంటున్నారు. మరోవైపు, బెడ్లు లేవని మమ్మల్ని రోడ్ల మీదే వదిలేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొవిడ్ బాధితులు' అని లోకేశ్ చెప్పారు.
 
'అనంతపురం జిల్లా మడుగుపల్లి గ్రామానికి చెందిన మన్మథ రెడ్డి తండ్రి కరోనాతో మరణించారు. కుటుంబ సభ్యులకు వైద్యం అందని పరిస్థితి. ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఇప్పటికైనా జగన్ రెడ్డి కళ్లు తెరవాలని కోరుకుంటున్నాను' అని లోకేశ్ ట్వీట్ చేశారు.

More Telugu News