Indian Railways: సరకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే వినూత్న నిర్ణయం.. ఇక కార్గోలోనూ ఎక్స్‌ప్రెస్ సేవలు

  • ఆగస్టు 5 నుంచి ‘కార్గో ఎక్స్‌ప్రెస్’
  • ఆరు నెలల పాటు ప్రయోగాత్మకంగా అమలు
  • టన్నుకు రూ. 2,500 మాత్రమే
First Cargo Express of Indian Railways to Run on Hyderabad Delhi Route

సరుకు రవాణా సేవల విషయంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత గూడ్స్ రైళ్లకు నిర్ణీత కాలవ్యవధి ఉండకపోవడంతో అవి గమ్యానికి ఎప్పుడు చేరేది ఆ రైల్వేకు కూడా తెలియదు. ఈ నేపథ్యంలో కార్గోలో ఎక్స్‌ప్రెస్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘కార్గో ఎక్స్‌ప్రెస్’ సేవలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఆగస్టు 5 నుంచి ఆరు నెలలపాటు ప్రయోగాత్మకంగా దీనిని నడపాలని నిర్ణయించినట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది.

వ్యవసాయ ఉత్పత్తిదారులు, వ్యాపారులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల యజమానులకు ఈ కార్గో ఎక్స్‌ప్రెస్‌తో ప్రయోజనం కలుగుతుందని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా తెలిపారు. హైదరాబాద్-ఢిల్లీ మధ్య టన్నుకు సగటున రూ. 2,500 కనీస ధరను నిర్ణయించినట్టు సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ పేర్కొన్నారు. అయితే, ఇది సరుకును బట్టి మారుతుందని, రోడ్డు రవాణాతో పోలిస్తే 40 శాతం తక్కువని తెలిపారు. అవసరమైన వారు 97013 71976, 040-27821393 నంబర్లలో కానీ,  దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో కానీ సంప్రదించాలని ఆయన కోరారు.

More Telugu News