earthquake: అలాస్కా పీఠభూమిని కుదిపేసిన భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

  • రిక్టర్ స్కేలుపై 7.8గా తీవ్రత  నమోదు
  • భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల వరకు సునామీ హెచ్చరికలు జారీ
  • ఆ తర్వాత సునామీ హెచ్చరికలు వెనక్కి
Huge  Earthquake Hits Off Alaska

అలాస్కా పీఠభూమిని నిన్న భారీ భూకంపం కుదిపేసింది. ఉదయం 6:12 గంటలకు ఆంకోరేజ్‌కు నైరుతి దిశగా 800 కిలోమీటర్లు, పెర్రివిలేకు ఆగ్నేయంగా 96 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు భూకంపం కేంద్రం నుంచి సుమారు 300 కిలోమీటర్ల వరకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

సముద్ర తీర ప్రాంతాల్లోని వారితోపాటు దీవుల్లో, దిగువ ప్రాంతాల్లో ఉన్న వారిని అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారు. భూకంప తీవ్రత, ఇతర ప్రమాణాలను బట్టి భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల వరకు ప్రమాదకరంగా అలలు దూసుకువచ్చే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది.  భూకంపం తర్వాత కూడా చాలా సేపటి వరకు అలలు సాధారణంగానే ఉండడంతో సునామీ హెచ్చరికలను ఆ తర్వాత వెనక్కి తీసుకున్నారు.

More Telugu News