Amit Shah: బీజేపీ కురువృద్ధుడు అద్వానీతో భేటీ అయిన అమిత్ షా

  • అద్వానీతో 30 నిమిషాల పాటు చర్చలు జరిపిన అమిత్ షా
  • బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణ నేపథ్యంలో భేటీ 
  • అయోధ్య భూమిపూజకు రావాల్సిందిగా ఆహ్వానం
  • వచ్చే నెల 5న రామాలయ నిర్మాణానికి భూమిపూజ
Amit Shah meets Advani

బీజేపీ సీనియర్ నేత అద్వానీతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. అద్వానీ నివాసానికి మరో బీజేపీ నేత భూపేందర్ యాదవ్ తో కలిసి అమిత్ షా వెళ్లారు. దాదాపు 30 నిమిషాల పాటు అద్వానీతో చర్చలు జరిపారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఈనెల 24న సీబీఐ కోర్టు ముందు అద్వానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావాల్సి ఉంది. దీనికి సంబంధించే అమిత్ షా ఆయనను కలిసినట్టు, దీనిపై చర్చించినట్టు తెలుస్తోంది.  

మరోవైపు, వచ్చే నెల 5న అయోధ్యలో జరగనున్న రామాలయం భూమిపూజ కార్యక్రమానికి సంబంధించి కూడా వీరు చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా, భూమిపూజకు హాజరు కావాల్సిందిగా అద్వానీని అమిత్ షా ఆహ్వానించారు. భూమిపూజ కార్యక్రమానికి మోదీ, అమిత్ షా, అద్వానీ, మురళీ మనోహర్ జోషి, రాజ్ నాథ్ సింగ్, ఉమాభారతి, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ తదితరులు హాజరుకానున్నారు. కరోనా నేపథ్యంలో 50 మంది వీఐపీలతో పాటు మొత్తం 200 మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.  

More Telugu News