Ambati Rambabu: కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత వీడియో విడుదల చేసిన అంబటి

Ambati Rambabu shares a selfie video after testing corona positive
  • నాకు కరోనా అని ఈ ఉదయం తెలిసింది
  • ప్రస్తుతం ఐసొలేషన్ లో ఉన్నా
  • ఒక ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించుకోవాలని అనుకుంటున్నా
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో, ఆయన ఐసొలేషన్ కు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక వీడియో విడుదల చేశారు. తనకు కరోనా సోకినట్టు ఈ ఉదయం తెలిసిందని వీడియోలో అంబటి తెలిపారు.

'నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఎంతో మంది ఫోన్లు చేస్తున్నారు. అయితే కాల్స్ ను నేను రీసీవ్ చేసుకోలేకపోతున్నాను. నేను ఐసొలేషన్ లో ఉన్నాను. ఒక ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నా. చాలా ధైర్యంగా ఉన్నా. ఎవరూ ఆందోళన చెందొద్దు. నాతో ఫోన్లో మాట్లాడేందుకు ఎవరూ ట్రై చేయొద్దు. అందరికీ ఫోన్ ద్వారా సమాధానం చెప్పేదానికన్నా వీడియో ద్వారా ఒకసారి చెపితే సరిపోతుందని ఈ వీడియో ద్వారా స్పందిస్తున్నా.

నాకు కరోనా పాజిటివ్ అని ఈ ఉదయం తెలిసింది. ఆర్టీపీసీ టెస్ట్ ద్వారా ఈ విషయం తేలింది. బయటకు కచ్చితంగా వస్తాను. ఆందోళన చెందొద్దు' అని వీడియోలో తెలిపారు.
Ambati Rambabu
YSRCP
Corona Virus

More Telugu News