సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించబోతున్న జెనీలియా

22-07-2020 Wed 16:51
  • నాలుగేళ్లుగా మాంసాహారానికి దూరంగా ఉన్న జెనీలియా దంపతులు
  • కొన్ని మొక్కలతో మాంసాహారం వంటి ఆహారాల తయారీ
  • 'ఇమేజిన్ మీట్' పేరుతో ఫుడ్ బిజినెస్ ప్రారంభించనున్న కపుల్
Genelia starting new business

తెలుగులో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన జెనీలియా... బాలీవుడ్ లో సైతం మంచి గుర్తింపును తెచ్చుకుంది. బాలీవుడ్ లో నటిస్తూ హీరో రితీశ్ దేశ్ ముఖ్ ను ప్రేమించి, పెళ్లాడింది. గత నాలుగేళ్లుగా భార్యాభర్తలిద్దరూ మాంసాహారానికి దూరంగా ఉన్నారు. మాంసాహారం వంటి రుచి, వాసన, పోషక పదార్థాలు ఉన్న కొన్ని మొక్కలను వీరు తమ ఆహారంలో ఉపయోగిస్తున్నారు.

ఇలాంటి ఆహారాన్ని జనాలకు అందుబాటులోకి తీసుకురావాలని వీరిద్దరూ భావిస్తున్నారు. అమెరికాకు చెందిన ఆర్చర్ డేనియల్స్ మిడ్ ల్యాండ్ గుడ్ ఫుడ్స్ ఇన్స్టిట్యూట్ తో కలిసి 'ఇమేజిన్ మీట్' పేరుతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నారు. బిర్యానీ, కబాబ్ లాంటి ఆహారాన్ని కూడా వినియోగదారులకు అందిస్తామని వీరు చెపుతున్నారు.