అంబటి రాంబాబుకి కరోనా పాజిటివ్

22-07-2020 Wed 14:50
  • వరుసగా కరోనా బారిన పడుతున్న వైసీపీ నేతలు
  • క్వారంటైన్ లో చికిత్స పొందుతున్న అంబటి
  • గుంటూరు జిల్లాలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా
Ambati Rambabu tests Corona positive

వైసీపీ కీలక నేతలందరూ వరుసగా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి పాజిటివ్ అని నిన్న రాత్రి తేలగానే పార్టీ శ్రేణులు కలవరపాటుకు గురయ్యాయి. ఇప్పుడు తాజాగా పార్టీ కీలక నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కూడా కరోనా నిర్ధారణ అయింది. టెస్టుల్లో పాజిటివ్ అని తేలిన వెంటనే ఆయన క్వారంటైన్ లోకి వెళ్లారు. మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.

గుంటూరు జిల్లాలో కరోనా బారిన పడిన మూడో ఎమ్మెల్యే అంబటి కావడం గమనార్హం. ఇప్పటికే తెనాలి ఎమ్మెల్యే శివకుమార్, పొన్నూరు ఎమ్మెల్యే వెంకట రోశయ్యలు కరోనా బారిన పడ్డారు. సత్తెనపల్లిలో ఇప్పటి వరకు 70 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు సత్తెనపల్లిలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించాలని అధికారులను అంబటి కోరారు. మరోవైపు హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో విజయసాయిరెడ్డి చికిత్స పొందుతున్నారు.