ప్రభాస్ ని 'ఫాలో' అవుతున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ!

22-07-2020 Wed 14:13
  • ప్రభాస్ 21వ సినిమాలో దీపిక పదుకొణే 
  • ఇన్ స్టాలో దీపికను ఫాలో అవుతున్న ప్రభాస్
  • నిన్నటినుంచి ప్రభాస్ ని ఫాలో అవుతున్న దీపిక
Deepika Padukone too follows Prabhas

ప్రభాస్ నటించే 21వ చిత్రంలో బాలీవుడ్ భామ దీపిక పదుకొణే కథానాయికగా నటించనుందంటూ చిత్ర నిర్మాతలు ప్రకటించిన విషయం విదితమే. ఇక ఆ న్యూస్ వచ్చినప్పటి నుంచీ ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. భలే కాంబినేషన్ సెట్ అయిందంటూ సోషల్ మీడియాలో కాంప్లిమెంట్లు కురిపిస్తున్నారు.

ఇదిలావుంచితే, ఈ ప్రకటన తర్వాత ప్రభాస్ కూడా హుందాగా వ్యవహరించాడు. ఇన్ స్టాగ్రాంలో దీపికను ఫాలో అవడం మొదలెట్టాడు. దాంతో, మరి దీపిక కూడా ప్రభాస్ ని గౌరవిస్తూ అతనిని ఫాలో అవుతుందా? అన్న కుతూహలం అందరిలోనూ కలిగింది. అభిమానులు ఊహించినట్టుగానే నిన్నటి నుంచి దీపిక కూడా ఇన్ స్టాలో ప్రభాస్ ని ఫాలో అవుతోంది.

వాస్తవానికి ప్రభాస్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఫాలోవర్లు దీపికకు వున్నారు. ఇన్ స్టాలో 4.9 మిలియన్ల ఫాలోవర్లని కలిగివున్న ప్రభాస్ కేవలం ఇదుగుర్ని మాత్రమే ఫాలో అవుతుండగా, 50.7 మిలియన్ల ఫాలోవర్లు వున్న దీపిక 127 మందిని ఫాలో అవుతోంది. మొత్తానికి వీరిద్దరూ ఒకర్ని ఒకరు ఫాలో అవుతూ మంచి స్నేహబంధాన్ని ఏర్పరచుకుంటున్నారు. సినిమా క్వాలిటీ బాగా రావడానికి ఇటువంటి బంధం ఎంతో అవసరం!