అదేంటి హైదరాబాద్ పారిపోయారా?: విజయసాయిపై బుద్ధా వెంకన్న సెటైర్

22-07-2020 Wed 10:00
  • విజయసాయికి కరోనా పాజిటివ్
  • హైదరాబాద్ లో చికిత్స
  • విశాఖలో ఎందుకు ట్రీట్ మెంట్ తీసుకోలేదన్న బుద్ధా
Budda Venkanna Setires on Vijaya Sai Reddy

కరోనా పాజిటివ్ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, హైదరాబాద్ లో చికిత్స పొందుతుండటంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న సెటైర్లు వేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేస్తూ, "అదేంటి హైదరాబాద్ పారిపోయారా?కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారా? విజయసాయి రెడ్డి  గారు. ఓహో అల్లుడు పాలన మీద నమ్మకం లేదా? గుండ్రాయిలా ఉన్న అచ్చెన్నకి కార్పొరేట్ వైద్యం ఎందుకు ఈఎస్ఐ ఉండగా అని ఒక బిసి నాయకుడిని అవమానిస్తూ మీ రాక్షస మనస్తత్వం బయటపెట్టారు" అని అన్నారు. ఆపై, "మరి మీరు విశాఖ లో కేజీహెచ్ ట్రీట్మెంట్ తీసుకోకుండా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లడం ఏంటి?అన్నట్టు ఇది కరోనా పాజిటివా?వివేకా గారి కేసులో సీబీఐ పాజిటివా?ఆయన హత్యకు గురైనప్పుడు మీరు సంభ్రమాశ్చర్యాలకు గురైయ్యారు గుర్తుందా?" అని సెటైర్లు వేశారు.