దేశంలో ఒక్కరోజులో 648 మంది కరోనాతో మృతి

22-07-2020 Wed 09:39
  • గత 24 గంటల్లో భారత్‌లో 37,724 మందికి కరోనా 
  • మొత్తం కేసులు 11,92,915
  • మృతుల సంఖ్య మొత్తం 28,732
  • 4,11,133 మందికి ఆసుపత్రుల్లో చికిత్స  
spike of 37724 cases and 648 deaths reported in India in the last 24 hours

దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం... గత 24 గంటల్లో భారత్‌లో 37,724 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 648 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 11,92,915కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 28,732కి పెరిగింది. 4,11,133 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 7,53,050 మంది కోలుకున్నారు.

కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,47,24,546 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 3,43,243 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.