మీకు అర్థం అయిందిగా... పవన్ కల్యాణ్ వీడియో పెడుతూ హీరో నిఖిల్ పోస్ట్ వైరల్!

22-07-2020 Wed 09:02
  • పవన్ పై సినిమా తీస్తున్న వర్మ
  • శిఖరాన్ని చూసి కుక్క మొరుగుతోంది
  • శిఖరం తలతిప్పి చూడబోదన్న నిఖిల్
Hero Nikhil Setire on Ramgopal Varma

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఓ హీరో ఎన్నికల్లో ఓడిపోయిన తరువాతి కథ అంటూ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించినదే అన్నది బహిరంగ రహస్యమే. ఎన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చినా, ఎప్పటికప్పుడు చిత్రం గురించిన విశేషాలను పంచుకుంటూ వెళుతున్న వర్మ, తాజాగా, 'గడ్డి తింటావా...' సాంగ్ ను విడుదల చేయగా, అది వైరల్ అయింది.

ఇక, టాలీవుడ్ హీరో నిఖిల్, తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, "శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా... ఆ మహా శిఖరం తల తిప్పి చూడదు... మీకు అర్థం అయిందిగా?" అంటూ ట్వీట్ పెట్టారు. దీనికి 'పవర్ స్టార్', 'పవన్ కల్యాణ్' అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించాడు. దీనికి పవన్ కల్యాణ్ కు చెందిన చిన్న వీడియోను కూడా జోడించాడు.