Odisha: ఒడిశాలో కరోనాతో అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కన్నుమూత

ADM Of Odishas Gajapati Dies with Covid
  • గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కరుణాకర్
  • కాపాడుకోలేకపోయామన్న కలెక్టర్
  • అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం
ఒడిశాలోని గజపతి జిల్లాకు చెందిన అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కరుణాకర్ పైక (55) కరోనాతో కన్నుమూశారు. కరోనా బారినపడిన ఆయన బరంపురంలోని ఎంకేసీజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పర్లాకిమిడి కొవిడ్ ఆసుపత్రి ఇన్‌చార్జ్ అయిన కరుణాకర్ ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ అధికారి. కరుణాకర్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, బరంపురం ఆసుపత్రికి తరలించినా కాపాడలేకపోయామని గజపతి కలెక్టర్ అనుపమ్ సాహా ఆవేదన వ్యక్తం చేశారు. కరుణాకర్‌కు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
Odisha
Gajapathi dist
COVID-19
Majistrate

More Telugu News