వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి భర్త కన్నుమూత

21-07-2020 Tue 22:24
  • అనారోగ్యంతో బాధపడుతున్న నాగభూషణరావు
  • ఢిల్లీలో చికిత్స పొందుతూ మృతి
  • రెడ్డి శాంతి కుటుంబంలో తీవ్ర విషాదం
Husband of YSRCP MLA Reddy Shanti dies of illness

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి భర్త నాగభూషణరావు మృతి చెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నాగభూషణరావు మాజీ ఐఎఫ్ఎస్ అధికారి. రెడ్డి శాంతి, నాగభూషణరావు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. నాగభూషణరావు మృతితో ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అటు పాతపట్నం నియోజకవర్గంలోనూ విషాద ఛాయలు అలముకున్నాయి.