Budda Venkanna: ట్విట్టర్ ప్రత్యర్థులమే తప్ప మా మధ్య ఎలాంటి గట్టు తగాదాలు లేవు: విజయసాయికి కరోనాపై బుద్ధా వెంకన్న

Buddha Venkanna responds on Vijayasai Reddy who was infected by corona
  • విజయసాయికి కరోనా పాజిటివ్
  • త్వరగా కోలుకోవాలన్న బుద్ధా
  • ట్విట్టర్ లో మళ్లీ యాక్టివ్ అవ్వాలంటూ ఆకాంక్ష
వైసీపీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలడంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించారు. రాజకీయంగా ట్విట్టర్ ప్రత్యర్థులమే తప్ప తమ మధ్య ఎలాంటి గట్టు తగాదాలు లేవని వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి గారు కనికరం లేని కరోనా బారిన పడడం బాధాకరం అని విచారం వ్యక్తం చేశారు. ఆయన కరోనా నుంచి త్వరగా కోలుకుని ట్విట్టర్ లో మళ్లీ యాక్టివ్ అవ్వాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు.
Budda Venkanna
Vijay Sai Reddy
Corona Virus
Positive
Twitter

More Telugu News