రాజకీయంగా విభేదించినా ఈ కరోనాకు అందరం ఒకటే... విజయసాయిగారూ మీరు త్వరగా కోలుకోవాలి: వంగలపూడి అనిత

21-07-2020 Tue 22:03
  • వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా
  • క్వారంటైన్ లోకి వెళుతున్నట్టు ప్రకటన
  • ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ మహిళా నేత
Vangalapudi Anitha wishes get well soon for Vijayasai

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కరోనా బారినపడ్డాడంటూ మీడియాలో కథనాలు వస్తుండడం పట్ల టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత స్పందించారు. రాజకీయంగా విభేదించినా ఈ కరోనాకి అందరం ఒక్కటేనని వ్యాఖ్యానించారు. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను విజయసాయిరెడ్డి గారూ అంటూ అనిత ట్వీట్ చేశారు. అటు, టీడీపీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విజయసాయిరెడ్డి అంశంలో వ్యంగ్యం ప్రదర్శించింది. "క్వారంటైన్ కు వెళుతున్నా అని చెప్పుకోవడం ఎందుకు, నాకు కరోనా పాజిటివ్ అని చెప్పుకోవచ్చుగా.. వై దిస్ కొలవెరి..?" అంటూ సెటైర్ వేసింది. త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించింది.