సీతానగరం పోలీస్ స్టేషన్ లో యువకుడికి శిరోముండనం ఘటనపై సీఎం జగన్ సీరియస్

21-07-2020 Tue 21:29
  • తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు
  • విచారణ జరిపిన డీజీపీ
  • ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్
CM Jagan serious on Seethanagaram issue where a youth was tonsured in a police station

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్ లో వరప్రసాద్ అనే యువకుడికి శిరోముండనం చేసిన ఘటనపై సీఎం జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులైన సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోసారి ఇలాంటివి జరగరాదని స్పష్టం చేశారు. కాగా, ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన డీజీపీ గౌతమ్ సవాంగ్ వెంటనే విచారణ జరిపి, ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.