వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్

21-07-2020 Tue 21:59
  • కరోనా బారినపడిన విజయసాయి
  • ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్
  • పది రోజులు హోం క్వారంటైన్ లో ఉండాలని విజయసాయి నిర్ణయం
YSRCP MP Vijayasai Reddy tested corona positive

కరోనా మహమ్మారి బారినపడ్డ వైసీపీ ప్రజాప్రతినిధుల జాబితాలో ఎంపీ విజయసాయిరెడ్డి కూడా చేరారు. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా, విజయసాయిరెడ్డికి కూడా కరోనా పాజిటివ్ అని తేలినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది.

ఈ నేపథ్యంలో, విజయసాయి ట్విట్టర్ లో స్పందించారు. "కరోనా పరిస్థితుల దృష్ట్యా, నాకు నేనుగా వారం నుంచి 10 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించుకున్నాను. ముందుజాగ్రత్త చర్యగా క్వారంటైన్ లో ఉండడం తప్పదు. టెలిఫోన్ లోనూ అందుబాటులో ఉండను.. ఏవైనా కొన్ని అత్యవసర విషయాలకు మాత్రమే సంప్రదించగలరు" అంటూ ట్వీట్ చేశారు.