ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు... ఒక్కరోజులో 62 మంది మృత్యువాత

21-07-2020 Tue 17:32
  • ఏపీలో 758కి చేరిన కరోనా మృతుల సంఖ్య
  • కొత్తగా 4,944 పాజిటివ్ కేసులు
  • ఇవాళ 1,232 మంది డిశ్చార్జి
Sixty two people dies of corona in AP

ఏపీలో కరోనా మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. తాజాగా ఒక్కరోజులో రికార్డు స్థాయిలో 62 మంది కరోనాతో మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లాలో 10 మంది, విశాఖపట్నం జిల్లాలో 9 మంది, చిత్తూరు జిల్లాలో 8 మంది, శ్రీకాకుళం జిల్లాలో ఏడుగురు, అనంతపురం జిల్లాలో ఆరుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరుగురు, గుంటూరు జిల్లాలో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో ఐదుగురు, కర్నూలు జిల్లాలో నలుగురు, కడప జిల్లాలో ఒకరు, విజయనగరం జిల్లాలో ఒకరు కన్నుమూశారు. దాంతో ఏపీలో కరోనా మరణాల సంఖ్య 758కి పెరిగింది.

ఇక కొత్త కేసులు కూడా తీవ్రస్థాయిలోనే వచ్చాయి. గడచిన 24 గంటల్లో 37,162 శాంపిల్స్ పరీక్షించగా, 4,944 మందికి కరోనా నిర్ధారణ అయింది. దాదాపు అన్ని జిల్లాల్లో భారీగా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. దాంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 58,668కి చేరింది. ఇవాళ 1,232 మందిని డిశ్చార్జి చేయగా, ఇంకా 32,336 మంది చికిత్స పొందుతున్నారు.