Bharat: సైన్యం చేతికి డేగ కళ్లతో నిఘా వేసే 'భారత్' డ్రోన్లు

  • భారత్ డ్రోన్లను దేశీయంగా తయారుచేసిన డీఆర్డీవో
  • రాత్రివేళల్లోనూ నిఘా వేయగల భారత్
  • రాడార్లకు చిక్కని డిజైన్
Bharat drone for Indian army to use in borders

చైనాతో ఇటీవల సరిహద్దుల్లో నెలకొన్న వివాదాల నేపథ్యంలో భారత్ తన రక్షణ సాధన సంపత్తిని మరింత ఆధునికీకరించుకుంటోంది. ఈ క్రమంలో డీఆర్డీవో దేశీయంగా రూపొందించిన 'భారత్' డ్రోన్లను సైన్యానికి అప్పగించారు. డేగ కళ్లతో నిఘా వేసే ఈ 'భారత్' డ్రోన్లతో సరిహద్దుల్లో పొరుగుదేశాల సైనికుల కదలికలను స్పష్టంగా గమనించవచ్చు. చైనాతో సరిహద్దుల్లోని తూర్పు లడఖ్ ప్రాంతంలో ఉండే అత్యంత ఎత్తయిన ప్రాంతాలోన్లూ, పర్వత భూభాగాల్లోనూ 'భారత్' డ్రోన్లు అత్యంత సమర్థంగా నిఘా విధులు నిర్వర్తిస్తాయని దేశ రక్షణ వర్గాలు చెబుతున్నాయి.

చండీగఢ్ లో డీఆర్డీవోకు చెందిన రీసెర్చ్ సెంటర్ లో ఈ డ్రోన్లను అభివృద్ధి చేశారు. వీటిని ప్రపంచంలోనే అత్యంత చురుకైన, తక్కువ బరువున్న నిఘా డ్రోన్లుగా పేర్కొంటున్నారు. భారత్ డ్రోన్ అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ (ఏఐ) ఆధారంగా పనిచేస్తుందని, శత్రువు ఎవరో, మిత్రుడు ఎవరో ఇట్టే పసిగట్టి, తదనుగుణంగా ప్రతిస్పందిస్తుందని డీఆర్డీవో వర్గాలు తెలిపాయి. ఈ డ్రోన్ అత్యంత శీతల వాతావరణంలోనూ, కఠిన పరిస్థితుల్లోనూ పనిచేయగలదని, రాత్రివేళల్లోనూ కచ్చితమైన నిఘా వేస్తుందని వెల్లడించాయి. దట్టమైన అడవుల్లో దాక్కునే మనుషుల్ని సైతం ఇవి గుర్తించగలవని, పైగా దీని డిజైన్ కారణంగా రాడార్లు వీటిని పసిగట్టలేవని డీఆర్డీవో నిపుణులు పేర్కొన్నారు.

More Telugu News