సినీనటి సోన‌మ్ క‌పూర్ ను అరెస్ట్ చేయాలన్న నెటిజన్!

21-07-2020 Tue 13:24
  • ముంబై నుంచి లండన్‌ వెళ్లిన సోనం
  • భర్తతో కలిసి లండన్‌లో క్వారంటైన్‌లో బాలీవుడ్ భామ
  • నిబంధనలు ఉల్లంఘించిందని నెటిజన్ ట్వీట్
  • కరోనా వల్ల టైం దొరకడంతో విమర్శలు చేస్తున్నారన్న సోనం
sonam kapoor mocks netizen

కరోనా విజృంభణ నేపథ్యంలో త‌న భ‌ర్త ఆనంద్ అహూజాతో ముంబై నుండి లండ‌న్ వెళ్లిన బాలీవుడ్ నటి సోన‌మ్ క‌పూర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. అయితే, ఆమె క్వారంటైన్‌ నిబంధనలను పాటించట్లేదని, ఆమెను అరెస్ట్ చేయాలని ఓ నెటిజ‌న్ విమర్శలు గుప్పించారు.

దీనిపై ఆమె రిప్లై ఇస్తూ అతడికి చురకలంటించింది. తాను క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించలేదని చెప్పింది. తాను గార్డెన్‌లో వీడియో తీసుకుని పోస్ట్ చేశానని, ఆ గార్డెన్ తమ ఇంటికి అటాచ్ అయి ఉంటుందని తెలిపింది. కరోనా విజృంభణ వ‌ల్ల ప్ర‌జ‌ల‌కి చాలా స‌మ‌యం దొరికిందని, అందుకే ఇటువంటి విమర్శలు చేస్తున్నారన్నట్లు చురకలంటించింది. ఇవ‌న్నీ ప‌ట్టించుకోవ‌ద్దని హితవు పలికింది.

కాగా, కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో సినీనటులు ఇంటికే పరిమితమవుతున్నారు. విదేశీ ప్రయాణాలు చేస్తే క్వారంటైన్‌లో ఉండడం తప్పనిసరి చేస్తూ అన్ని దేశాలు నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సినీ స్టార్లు తమ ఇళ్లవద్ద తీసుకున్న ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతున్నారు. అయితే, పలుసార్లు వారు చేస్తోన్న పోస్ట్‌లపై ట్రోలింగ్ జరుగుతోంది.