రాష్ట్రంలో కేసీఆర్ పుట్టడం అదృష్టం.. ఆయన కడుపున కేటీఆర్ పుట్టడం మరో అదృష్టం: గంగుల

21-07-2020 Tue 12:48
  • పక్కనే మానేరు నది ఉన్నా కరీంనగర్ కు తాగు నీరు అందేది కాదు
  • అర్బన్ భగీరథ మిషన్ ద్వారా ఇప్పుడు నీరు అందుతోంది
  • ప్రజల చిరకాల వాంఛ నెరవేరినందుకు సంతోషంగా ఉంది
Gangula Kamalakar  praises KCR and KTR

పక్కనే మానేరు నది ఉన్నప్పటికీ కరీంనగర్ ప్రజలకు తాగునీరు అందేది కాదని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. కానీ ఇప్పుడు అర్బన్ భగీరథ మిషన్ ద్వారా ప్రజలకు నిరంతరం నీటిని అందిస్తున్నామని అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు నిరంతరం నీటిని అందించిన ప్రజానేత కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని చెప్పారు.

రాష్ట్రంలో కేసీఆర్ పుట్టడం ఒక అదృష్టమని... ఆయన కడుపున కేటీఆర్ పుట్టడం మరో అదృష్ణమని అన్నారు. కరీంనగర్ పట్టణంలో రూ. 110 కోట్ల నిధులను చేపట్టిన అర్బన్ భగీరథ తాగునీటి సరఫరాను ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్ లపై ప్రశంసలు కురిపించారు. కరీంనగర్ ప్రజల చిరకాల వాంఛ నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు.