Chiranjeevi: చిరంజీవి రియల్ లైఫ్ లో కూడా హీరోనే!: నాటి సంఘటనను చెప్పిన సుహాసిని

Chiranjeevi is real Hero says Suhasini
  • ఓ షూటింగ్ కోసం కారులో కేరళ వెళుతున్నాం  
  • మా కారును తాగుబోతులు అడ్డగించారు
  • చిరంజీవి వారందరినీ తరిమేశారు
మెగాస్టార్ చిరంజీవి తెరపై మాత్రమే హీరో కాదని... నిజ జీవితంలో కూడా హీరోనే అని సీనియర్ నటి సుహాసిని అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుహాసిని మాట్లాడుతూ గతంలో జరిగిన ఓ ఘటనను గుర్తుకు తెచ్చుకున్నారు.

'ఓ షూటింగ్ కోసం అప్పట్లో కేరళకు వెళ్లాం. నేను, చిరంజీవి కారులో వెళ్తున్నాం. అప్పుడు తప్పతాగి ఉన్న కొందరు మేము వెళ్తున్న కారును ఆపారు. కారు మీదకు బీరు సీసాలను విసిరారు. దాంతో, చిరంజీవికి కోపం వచ్చింది. వెంటనే తన వద్ద ఉన్న లైసెన్సుడు రివాల్వర్ ను తీసి వాళ్లను భయపెట్టారు. దీంతో తాగుబోతులు భయంతో అక్కడి నుంచి పారిపోయారు' అని సుహాసిని తెలిపారు. చిరంజీవి రియల్ లైఫ్ లో కూడా హీరోనే అని కితాబునిచ్చారు.
Chiranjeevi
Suhasini
Tollywood

More Telugu News