Shah Rukh Khan: త‌న ఇంటిని ప్లాస్టిక్ క‌వర్లతో క‌ప్పించిన షారుఖ్ ఖాన్.. ఫొటో వైరల్

Photo Of Shah Rukh Khans home Covered With Plastic Goes Viral
  • ముంబైలోని బంగ్లా వద్ద షారుఖ్ చర్యలు
  • కరోనా నేపథ్యంలో ప్లాస్టిక్ కవర్లు
  • మన్నత్‌ బంగ్లాలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటోన్న షారుఖ్

మ‌హారాష్ట్ర రాజధాని ముంబైలో క‌రోనా ఉద్ధృతి అత్యధికంగా ఉన్న విషయం తెలిసిందే. ముంబైలో బాలీవుడ్ సెలబ్రిటీలు అధికంగా ఉంటారు. తమకు కరోనా సోకకుండా వారు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తన మ‌న్న‌త్ బంగ్లాను ప్లాస్టిక్ కవర్లతో కప్పించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
                                                                                 
గాలి ద్వారా కూడా కరోనా వైర‌స్ వ్యాపిస్తుంద‌న్న ప్రతిపాదనలను కాదనలేమని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే షారూఖ్ ఖాన్ ముందు జాగ్ర‌త్త‌ చర్యలుగా బంగ్లాను ఇలా కవర్లతో చుట్టించారని తెలుస్తోంది. 

ఈ బంగ్లాలో షారూఖ్ త‌న భార్య గౌరీఖాన్‌తో పాటు ముగ్గురు పిల్ల‌ల‌తో క‌లిసి ఉంటారు. పండుగ సమయంలో ఆయన ఇంటికి అభిమానులు పెద్ద ఎత్తున వస్తుంటారు. కరోనా నేపథ్యంలో షూటింగులు లేకపోవడంతో ఆయన ఇంట్లోనే గడుపుతున్నారు.

  • Loading...

More Telugu News