ముఖ్యమంత్రి గారూ.. ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తగవు: వర్ల రామయ్య

21-07-2020 Tue 11:48
  • పాలన వికేంద్రీకరణ రద్దుకు ఆమోదం తెలిపే హక్కు కేంద్రానికే వుంది
  • దీనిపై పట్టుదలకు పోకుండా ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి
  • ద్వేషంతో రాజధానిని తరలించడం చరిత్ర క్షమించదు
varla ramaiah fires on ycp leaders

ఆంధ్రప్రదేశ్‌ మూడు రాజధానుల బిల్లులను  వైసీపీ ప్రభుత్వం గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ వద్దకు పంపిన నేపథ్యంలో ఈ విషయంపై టీడీపీ నేతలు విమర్శల జల్లు కురిపిస్తున్నారు. దీనిపై పట్టుదలకు పోకుండా ప్రజల అభిప్రాయాలను గౌరవించాలంటూ సీఎం జగన్‌కు టీడీపీ నేత వర్ల రామయ్య సూచనలు చేశారు.
 
'ముఖ్యమంత్రి గారూ.. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు ఆమోదం తెలిపే హక్కు కేంద్రానికే వుంది. దీనిపై పట్టుదలకు పోకుండా ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి. ఒక సామాజిక వర్గానికి చెందిన వారిపై ద్వేషంతో రాజధానిని తరలించడం చరిత్ర క్షమించదు. ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తగవు. అవునా?' అని వర్ల రామయ్య సూచించారు.