మీ పరామర్శ మాకు కొండంత బలాన్నిచ్చింది: చిరంజీవి ఫోన్ కాల్ పై బండ్ల గణేశ్

21-07-2020 Tue 10:22
  • కష్టంతో పైకి వచ్చారు
  • యావత్ ఇండస్ట్రీ మిమ్మల్ని చూసి నేర్చుకుంటే బాగుంటుంది
  • వందేళ్లు మీరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను
  • మీరు చేసిన పరామర్శ మాకు కొండంత బలం
bandla ganesh about chiru

సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ మెగాస్టార్‌ చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు. 'కష్టంతో పైకి వచ్చిన వాళ్లకి కష్టం తెలిసిన వాళ్లకి, ఏ అండా లేకుండా కొండగా ఇండస్ట్రీలో ఉన్న వాళ్లకి మనసు, ప్రేమ, అనురాగం ఆప్యాయతలు ఉంటాయన్నందుకు మీరే ఉదాహరణ. యావత్ ఇండస్ట్రీ మిమ్మల్ని చూసి నేర్చుకుంటే బాగుంటుంది. వందేళ్లు మీరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను' అని బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు.
 
'ఎలా ఉన్నావు అంటూ మీరు చేసిన పరామర్శ మాకు కొండంత బలం, తెలియని ఆనందం.. ఎంతో సంతోషాన్నిచ్చింది. ధన్యవాదాలు అన్నగారు' అని బండ్ల గణేశ్ తెలిపారు. కాగా, బండ్ల గణేశ్ ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనతో చిరంజీవి ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది.