కరోనా వైరస్‌ను సమర్థంగా అడ్డుకుంటున్న 'కోల్డ్ జైమ్' మౌత్‌స్ప్రే

21-07-2020 Tue 10:14
  • మౌత్‌స్ప్రేను అభివృద్ధి చేసిన స్వీడిష్ సంస్థ ఎంజైమాటికా
  • 20 నిమిషాల్లోనే వైరస్‌ను క్రియా రహితం చేస్తుందన్న పరిశోధకులు
  • సాధారణ జలుబుతోపాటు వివిధ రకాల వైరస్‌లను అడ్డుకుంటుందన్న సంస్థ
Swedish firms ColdZyme mouth spray deactivates COVID virus

కరోనా వైరస్‌కు టీకాను అభివృద్ధి చేసే పనిలో ప్రపంచ దేశాలు తలమునకలుగా ఉంటే స్వీడన్‌కు చెందిన లైఫ్ సైన్స్ సంస్థ ఎంజైమాటికా సరికొత్త మౌత్‌ స్ప్రేను విడుదల చేసింది. కోల్డ్ జైమ్ మౌత్‌ స్ప్రే పేరుతో తీసుకొచ్చిన ఈ స్ప్రే నోటిలోని 98.3 శాతం వైరస్‌ను చంపేస్తుందని సంస్థ పేర్కొంది.

సాధారణ జలుబు కోసం తయారుచేసిన ఈ మౌత్ స్ప్రే.. కొవిడ్‌కు కారణమయ్యే సార్స్-కోవ్-2 వైరస్‌ను నోటిలోనే నాశనం చేస్తుందని  తమ అధ్యయనంలో తేలినట్టు సంస్థ పేర్కొంది. 20 నిమిషాల వ్యవధిలోనే వైరస్‌ను క్రియారహితం చేస్తుందని వివరించింది. ఈ స్ప్రే వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవని తెలిపింది. నిజానికీ స్ప్రేను సాధారణ జలుబు నివారణ కోసం అభివృద్ధి చేసినా కరోనాతోపాటు వివిధ రకాల వైరస్‌లను ఇది అడ్డుకుంటుందని పరిశోధకులు తెలిపారు. దీని తయారీలో గ్లిజరాల్, అట్లాంటిక్ కాడ్ ట్రిప్నిన్లు ఉపయోగించినట్టు వివరించారు.