ఈ ప్రభావం ఏపీలో నిత్యావసరాల ధరలపై పడే ప్రమాదముంది: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
- పెరిగిన పెట్రో ధరలతో ప్రజలు అల్లాడుతున్నారు
- రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ భారం రూ.4కి పెంచడం తగదు
- సామాన్యుడిపై, ధనవంతుడిపై ఒకేలా పన్ను పెంపు న్యాయమా?
'అసలే పెరిగిన పెట్రో ధరలతో ప్రజలు అల్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ భారం రూ.4కి పెంచడం తగదు. మోపెడ్ నడిపే సామాన్యుడిపై, ఆయిలింజన్ ఉపయోగించే సన్నకారు రైతుపై, బెంజ్ కారు వాడే ధనవంతుడిపైనా ఒకేలా పన్ను పెంపు న్యాయమా? ఈ ప్రభావం నిత్యావసరాల ధరలపై పడి పేదలకు ఇంకా భారమయ్యే ప్రమాదముంది' అని విమర్శించారు.
'గతంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.2 భారం తగ్గించిన సందర్భాలున్నాయి. ఓ వైపు ధరలు, మరోవైపు పన్ను పెంచి కరోనా కాలంలో ప్రజలను మరింత కష్టాలకు గురిచేయడం దారుణం. పెంచిన వ్యాట్ ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి' అంటూ ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా 'అసలే మోత అదనంగా వాత' పేరిట ఓ పత్రికలో వచ్చిన వార్తను ఆయన పోస్ట్ చేశారు.