గుండెలు పిండే ఘటన: అమ్మను చూడాలని.. ఆసుపత్రి గది కిటికీపైకి ఎక్కి..

21-07-2020 Tue 08:28
  • పాలస్తీనాలో ఘటన
  • సోషల్ మీడియాతో కంటతడి పెట్టిస్తున్న ఫొటో
  • ట్విట్టర్‌లో షేర్ చేసిన ఐక్యరాజ్య సమితిలో శాశ్వత ప్రతినిధి మహ్మద్ సఫా
Palestinian climbs wall to see mom through window before she dies of COVID

కరోనా బారినపడి చికిత్స పొందుతున్న తల్లి బాగోగులు దగ్గరుండి చూసుకోలేక, అలాగని ఆమెను చూడకుండా ఉండలేక ఓ కొడుకు అనుభవించిన చిత్రవధ నెటిజన్ల గుండెల్ని పిండేస్తోంది. తల్లి చికిత్స పొందుతున్న ఆసుపత్రిలోకి వెళ్లి ఆమెను చూసే వీలులేకపోవడంతో ఏం చేయాలో పాలుపోని అతడు చిన్న ఉపాయం ఆలోచించాడు. ఆమె చికిత్స పొందుతున్న ఆసుపత్రి గది కిటికీ ఎక్కి కూర్చుని రాత్రీపగలు తల్లిని చూసుకునేవాడు. అయితే, తల్లి తిరిగి ఆరోగ్యంగా ఇంటికి వస్తుందన్న అతడి ఆశలు ఫలించలేదు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

పాలస్తీనాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ చూసిన వారి హృదయాలను పిండేస్తోంది. ఆసుపత్రి గది కిటికీపైకి ఎక్కి తల్లిని చూసుకున్న ఆ కుమారుడి పేరు జిహాద్ అల్-సువైటి. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత ప్రతినిధి మహ్మద్ సఫా ఈ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.