గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు పండుల, జకియా పేర్లను ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం

21-07-2020 Tue 06:48
  • ఖాళీ స్థానాలను భర్తీ చేసేందుకు సిద్ధం
  • గవర్నర్ కు పేర్లు సిఫారసు
  • పండుల ఎస్సీ, జకియా ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తులు 

గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. వీరిలో ఒకరు తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు కాగా, మరొకరు కడప జిల్లా రాయచోటికి చెందిన జకియా ఖానమ్. వీరిద్దరినీ ఖరారు చేసిన ప్రభుత్వం వీరి పేర్లను గవర్నర్‌కు సమర్పించి సిఫారసు చేసింది. కాగా, పండుల రవీంద్రబాబు ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి కాగా, జకియా ముస్లిం మైనారిటీ నేత.