Proteus: విభజించడానికి వీల్లేని పదార్థాన్ని రూపొందించిన బ్రిటీష్ ఇంజినీర్లు

  • ఈ పదార్థానికి ప్రొటియస్ అని నామకరణం చేసిన నిపుణులు
  • ద్రాక్ష పండ్లు, నత్త గుల్లల స్ఫూర్తిగా వినూత్న పరిశోధన
  • అతి తేలికైన, దృఢమైన కవచాల తయారీకి అనువైన ప్రొటియస్
British engineers design high solid material called Proteus

సృష్టిలో ఎంతో కఠినమైనదిగా భావించే వజ్రాన్ని కూడా రెండు ముక్కలుగా విభజించవచ్చు. కానీ తాము రూపొందించిన సరికొత్త పదార్ధాన్ని మాత్రం ఏ యంత్రాలు విభజించలేవని బ్రిటీష్ ఇంజినీర్లు అంటున్నారు. ఈ పదార్థానికి వారు ప్రొటియస్ అని నామకరణం చేశారు. ఎప్పటికప్పుడు రూపాన్ని మార్చుకోగలిగిన గ్రీకుల సముద్ర దేవత ప్రొటియస్ పేరునే ఈ దుర్భేద్యమైన పదార్థానికి పెట్టారు. ఈ పదార్థంతో తయారైన వస్తువులను లోహాలను కత్తిరించే యంత్రాలు కూడా ఏమీ చేయలేవట. డ్రిల్లింగ్ బిట్లు విరిగిపోవడం తప్ప దీంట్లోకి ఒక్క రంధ్రాన్ని కూడా చేయడం అసాధ్యమని బ్రిటీష్ ఇంజినీర్లు చెబుతున్నారు.

ఈ పదార్థంతో అతి తేలికైన, అత్యంత దృఢమైన కవచాలను తయారు చేయొచ్చని, బద్దలు కొట్టేందుకు వీల్లేని బైక్ లాక్ లు రూపొందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. బ్రిటన్ లోని డుర్హామ్ యూనివర్సిటీ, ఫ్రాన్ హోఫర్ ఇన్ స్టిట్యూట్ ఈ ప్రొటియస్ పదార్థాన్ని రూపొందించాయి. దీన్ని సిరామిక్ గోళాల నుంచి తయారుచేస్తారు. ద్రాక్ష పండ్ల ఉపరితలంపై ఉండే దృఢమైన పదార్థం, సముద్ర నత్తల పైభాగంలో ఉండే గట్టి పెంకు స్ఫూర్తిగా ఈ వినూత్న పదార్థాన్ని రూపొందించారు.

More Telugu News