Tirupati: కరోనా ఎఫెక్ట్.. తిరుపతిలో కఠిన ఆంక్షలు!

  • తిరుపతిలో భారీగా పెరుగుతున్న కేసులు
  • ఉదయం 6 నుంచి 11 గంటల వరకే షాపులు
  • మద్యం దుకాణాలు కూడా 11 గంటలకే బంద్
Strict rules in Tirupati due to rise in corona cases

ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 50 వేలకు చేరింది. చిత్తూరు జిల్లాలో సైతం కేసులు పెరిగిపోతున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో సైతం కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో తిరుపతిలో కఠిన ఆంక్షలను విధించారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే షాపులు తెరిచి ఉంటాయని చిత్తూరు జిల్లా కలెక్టర్ తెలిపారు. మద్యం దుకాణాలు సైతం ఉదయం 11 గంటల వరకే తెరిచి ఉంటాయని చెప్పారు. వచ్చే నెల 5వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. తిరుపతిలోని 48 డివిజన్లు కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయని చెప్పారు. మరోవైపు తిరుపతిలో 72 మంది పోలీసులకు కరోనా సోకగా... వారిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News