నా కెరీర్ నాశనం చేస్తానని బెదిరించాడు: కంగనా రనౌత్

20-07-2020 Mon 17:39
  • 'సుల్తాన్' సినిమాను నేను తిరస్కరించాను
  • ఆ తర్వాత ఆదిత్య చోప్రాకు క్షమాపణ కూడా చెప్పా
  • నాకే నో చెబుతావా అని బెదిరించాడు
Kangana Ranaut alleges Aditya Chopra threatens to finish her career

యశ్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రాపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తన కెరీన్ ను నాశనం చేస్తానని బెదిరించారని తెలిపింది. సల్మాన్ ఖాన్ హీరోగా 2016లో తెరకెక్కిన 'సుల్తాన్' చిత్రాన్ని తాను ఒప్పుకోకపోవడమే దీనికి కారణమని చెప్పింది. ఆ తర్వాత తాను క్షమాపణలు చెప్పేందుకు వెళ్లినప్పుడు ఆయన బాగానే ఉన్నారని... అనంతరం తనను బెదిరించారని చెప్పారు. 'నాకు నో అని చెప్పేందుకు నీకెంత ధైర్యం. నీ కెరీర్ ను నాశనం చేస్తా' అని బెదిరించారని తెలిపింది. ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే మహేశ్ భట్, కరణ్ జొహార్, జావెద్ అఖ్తర్ లపై కూడా ఆమె విమర్శలు గుప్పించిన సంగతి తెలిసింది.