Turtle: ఒడిశా తీరంలో అరుదైన పసుపు రంగు తాబేలు దర్శనం

  • గ్రామస్తులకు దొరికిన తాబేలు
  • అటవీ అధికారులకు అప్పగించిన గ్రామస్థులు 
  • జన్యులోపంతో పుట్టిన తాబేలు అయ్యుంటుందన్న నిపుణులు
Rare yellow turtle spotted in a Odisha village

ఒడిశాలోని బాలసోర్ జిల్లాలోని సుజన్ పూర్ గ్రామవాసులు అరుదైన తాబేలును చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సముద్ర తాబేలు పూర్తిగా పసుపు వర్ణంలో మెరిసిపోతూ దర్శనమిచ్చింది. దీనిపై ఆ తీరప్రాంత గ్రామవాసులు అటవీప్రాంత సంరక్షణ అధికారి భానుమిత్ర ఆచార్యకు సమాచారం అందించారు. ఆయన ఈ తాబేలును పరిశీలించి ఇలాంటి దాన్ని ఎప్పుడూ చూడలేదని వెల్లడించారు. ఎంతో అరుదైనదని అన్నారు.

దీని ఫొటోలను సోషల్ మీడియాలో చూసిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి సుశాంత నందా ఇది ఒక అల్బినో (జన్యులోపంతో సహజ వర్ణం కోల్పోయిన జీవి) అని పేర్కొన్నారు. ఇలాంటిదే సింధ్ ప్రాంతంలో కొన్నేళ్ల కిందట కనిపించిందని తెలిపారు. ఈ పసుపు వర్ణం తాబేలుకు కళ్లు గులాబీ రంగులో ఉండడం కూడా జన్యుపరమైన లోపమేనని వివరించారు.

More Telugu News