Rashmika Mandanna: లాక్ డౌన్ కి థ్యాంక్స్ అంటున్న రష్మిక!

  • మొదట్లో చిన్న బ్రేక్ దొరికిందనుకున్నాను 
  • లాక్ డౌన్ పొడిగించాక మా కూర్గ్ వెళ్లిపోయాను
  • చిన్నప్పటి నుంచీ ఇంటికి దూరంగానే వున్నాను 
  • ఇరవై మంది స్టాఫ్ కి జీతాలిస్తున్నానన్న రష్మిక  
Rashmika says thanks to Lock Down

'ఏదేమైనా ఈ లాక్ డౌన్ కి మాత్రం నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి' అంటోంది టాలీవుడ్ ప్రెట్టీ డాల్ రష్మిక మందన్న. దానికి కారణాన్ని కూడా తనే వివరించింది. తల్లిదండ్రులతో కలసి .. ఇంటి వద్ద హాయిగా .. హ్యాపీగా గడిపే అవకాశం ఈ లాక్ డౌన్ వల్ల తనకు లభించిందని ఈ ముద్దుగుమ్మ చెప్పింది.  

"లాక్ డౌన్ విధించిన మొదటి వారంలో 'హమ్మయ్య.. నేను కోరుకుంటున్న చిన్న బ్రేక్ దొరికింది' అని ఫీలయ్యాను. తర్వాత లాక్ డౌన్ మరోసారి పొడిగించాక ఇక ఇంటి మీదకు మనసు లాగింది. దాంతో హైదరాబాదు నుంచి అమ్మానాన్నల దగ్గరికి కూర్గ్ వెళ్లిపోయాను. చెప్పాలంటే, అసలు చిన్నప్పటి నుంచీ నేను ఇంటికి దూరమే. చిన్నప్పుడు బోర్డింగ్ స్కూల్లో వేశారు నన్ను. దాంతో వేసవి సెలవులకు తప్ప మిగతా అన్ని రోజులూ ఇంటికి దూరంగానే వుండేదాన్ని.

తర్వాత కాలేజీ చదువుకి మైసూరు వెళ్లాను. ఆ వెంటనే సినిమాల్లోకి రావడంతో ఎప్పుడూ షూటింగులు.. ప్రయాణాలతోనే సరిపోయింది. ఇప్పుడు ఇక్కడికి (కూర్గ్) వచ్చాక తెలిసింది, ఇన్నేళ్లలో నేను ఏం మిస్సయ్యానన్నది. మా ఇంటి కిటికీలోంచి బయటికి చూస్తే.. మంచుతో నిండిన కొండలు.. చుట్టూ సువాసన వెదజల్లే కాఫీ తోటలు.. వావ్.. అద్భుతంగా ఉందిక్కడ' అంటూ పరవశంతో చెప్పింది రష్మిక.

ప్రస్తుతం తాను ఆన్ లైన్ ద్వారా కొత్త కథలు వింటున్నానని చెప్పింది. గత కొన్నాళ్లుగా పనిలేకపోయినా, తన స్టాఫ్ తో పాటు తండ్రి బిజినెస్ కి సంబంధించిన ఉద్యోగులు మొత్తం ఇరవై మందికి జీతాలిస్తూ, వాళ్ల కుటుంబాల బాగోగులు చూసుకుంటున్నామని రష్మిక చెప్పింది.  

More Telugu News