nims: కరోనా వ్యాక్సిన్‌లో ముందడుగు.. హైదరాబాద్‌ నిమ్స్‌లో వాలెంటీర్‌కు తొలి డోస్

  • కోవాగ్జిన్‌ పేరిట వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోన్న భారత్‌
  • భారత్‌ బయోటెక్‌, ఐసీఎంఆర్ కలిసి కృషి
  • మొదటి దశ ట్రయల్స్‌ ప్రారంభించిన వ్యాక్సిన్‌ తయారీ బృందం
  • భారత్‌లో మొత్తం 12 వైద్య కేంద్రాల్లో వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌
Covaxin human clinical trials  begins at NIMS

కరోనా వైరస్‌ను నిరోధించడానికి ప్రపంచ దేశాలు వ్యాక్సిన్‌ను తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ రేసులో భారత్‌ కూడా మొదటి వరుసలో ఉంది. భారత్‌ బయోటెక్‌, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) కలిసి కోవాగ్జిన్‌ పేరిట వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని నిమ్స్ ‌ కేంద్రంగా పనిచేస్తున్న వ్యాక్సిన్‌ తయారీ బృందం మొదటి దశ ట్రయల్స్‌ ప్రారంభించింది.

క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా వాలంటీర్‌కు ఈ రోజు ఉదయం తొలి డోస్‌ ఇచ్చారు. దేశంలోని మొత్తం 12 వైద్య కేంద్రాల్లో కూడా వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. దేశీయంగా అభివృద్ది చేస్తున్న తొలి వ్యాక్సిన్ ఇదే. వీలైతే వచ్చేనెల 15 నాటికి వ్యాక్సిన్‌ను సిద్ధం చేయాలని పరిశోధకులు భావిస్తున్నారు. హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌కు చెందిన బయోసేఫ్టీ లెవెల్‌ మూడు ప్రయోగశాలల్లో ఈ టీకాను తయారు చేస్తోంది. కొవాగ్జిన్‌ మొదటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు డీసీజీఐ ఇప్పటికే అనుమతినిచ్చిన విషయం తెలిసిందే.

More Telugu News