ప్రభాస్-దీపిక కాంబినేషన్ పై కీర్తి సురేశ్ కామెంట్

20-07-2020 Mon 12:42
  • నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ 21వ చిత్రం
  • కథానాయికగా దీపిక పదుకొణే ఖరారు
  • 'బ్రహ్మాండమైన వార్త' అన్న కీర్తి సురేశ్  
Keerti Suresh wishes Prabhas and Deepika combo

ప్రభాస్ తన 21వ చిత్రాన్ని 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో కథానాయికగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక పదుకొణే నటించనున్న క్రేజీ వార్తను నిన్న నిర్మాతలు గ్రాండ్ గా ప్రకటించారు. దీపికకు రికార్డు స్థాయిలో పారితోషికాన్ని ఇస్తూ ఆమెను ఈ ప్రాజక్టులోకి తెచ్చినట్టు వార్తలొస్తున్నాయి. ఇక ఈ కాంబినేషన్ పట్ల ప్రభాస్ అభిమానులు తెగ ఆనందపడిపోతూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

ఈ క్రమంలో 'మహానటి' కథానాయిక కీర్తి సురేశ్ కూడా స్పందించింది. 'బ్రహ్మాండమైన వార్త ఇది.. మరో బ్లాక్ బస్టర్ చిత్రాన్ని సృష్టించడానికి ఓ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ జతకలిసింది..ఈ వెయింటింగ్ ని భరించలేకున్నాను.. ' అంటూ కీర్తి సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేసింది. ఎటువంటి భేషజాలు లేకుండా కీర్తి సురేశ్ ఈ విధంగా వీరికి విషెస్ చెప్పడాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.