వివేక హత్య కేసులో కొనసాగుతోన్న సీబీఐ దర్యాప్తు.. హైదరాబాద్ నుంచి పులివెందుల చేరుకున్న కుమార్తె సునీత
- మూడో రోజు పులివెందుల చేరుకున్న సీబీఐ అధికారులు
- వివేక హత్యకేసుకు సంబంధించిన వివరాల సేకరణ
- గత ఏడాది దారుణ హత్యకు గురైన వివేక
ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత హైదరాబాద్ నుంచి పులివెందుల చేరుకున్నారు. అధికారులతో ఆమె మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది మార్చి 15న వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం మూడు సార్లు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి విచారణ జరిపించగా, ఈ కేసును ఛేదించలేకపోయారు. దాంతో ఈ కేసును సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ వివేక కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించడంతో, ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు విచారణ ప్రారంభించారు.