Karnataka: తమ్ముడికి కరోనా.. తనకు సోకిందేమోనన్న భయంతో అన్న ఆత్మహత్య

Brother suicide after his younger brother tests covid positive
  • కర్ణాటకలోని కోలార్‌లో ఘటన
  • తమ్ముడికి కరోనా సోకడంతో ఆందోళన
  • ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య
తమ్ముడికి సోకిన కరోనా తనకెక్కడ అంటుకుంటుందోనన్న భయంతో అన్న ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కోలారులోని గాంధీనగర్ కాలనీకి చెందిన నాగరాజ్ (37) తాపీ కార్మికుడు. అతడి తమ్ముడికి కరోనా సోకినట్టు శనివారం నిర్ధారణ అయింది.

సమాచారం అందుకున్న వైద్యాధికారులు ఇంటికొచ్చి అతడిని ఆసుపత్రికి తరలించారు. తమ్ముడికి కరోనా సోకిందని తెలిసినప్పటి నుంచి నాగరాజ్‌లో ఆందోళన మొదలైంది. తనకు కూడా వైరస్ సోకి ఉంటుందన్న భయంతో అదే రోజు రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న ఉదయం ఫ్యాన్‌కు వేలాడుతున్న నాగరాజ్ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Karnataka
Kolar
Corona Virus
Suicide

More Telugu News