TRS: కరోనా బారినపడిన కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే, భార్య, కుమారుడు

Quthbullapur MLA Vivekananda goud and his family infected to corona virus
  • తెలంగాణలో కరోనా బారినపడుతున్న ప్రజాప్రతినిధులు
  • 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లోకి వివేకానందగౌడ్ కుటుంబం
  • వేర్వేరు గదుల్లో ఉంటూ చికిత్స
తెలంగాణలో టీఆర్ఎస్‌కు చెందిన మరో ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్, ఆయన భార్య సౌజన్య, కుమారుడు విధాత్‌లకు కరోనా సోకినట్టు నిన్న వైద్యులు నిర్ధారించారు. దీంతో వీరంతా హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఇంట్లోనే వేర్వేరు గదుల్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.

వైద్యుల సూచన మేరకు తామంతా 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండనున్నట్టు ఎమ్మెల్యే వివేకానంద తెలిపారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీతోపాటు మరెందరో ప్రజాప్రతినిధులు ఇప్పటికే కరోనా బారినపడి కోలుకున్నారు. తెలంగాణలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్న వేళ ప్రజా ప్రతినిధులు కూడా కొవిడ్ బారినపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
TRS
quthbullapur
MLA Vivekananda Goud
Corona Virus

More Telugu News