తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు శ్రీనివాసమూర్తి దీక్షితులు కరోనాతో కన్నుమూత

20-07-2020 Mon 08:14
  • రెండు దశాబ్దాలకు పైగా శ్రీవారి సేవలో తరించిన దీక్షితులు
  • ఆలయ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియల నిర్వహణ అనుమానమే
  • మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగింతపై సందిగ్ధత
Tirumala Ex priest died with corona

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు శ్రీనివాసమూర్తి దీక్షితులు కరోనాతో కన్నుమూశారు. శ్రీవారి సేవలో రెండు దశాబ్దాలకు పైగా కొనసాగిన దీక్షితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు.

దీక్షితులకు ఆలయం తరపున సంప్రదాయ పద్ధతిలో అంతిమ వీడ్కోలు నిర్వహించాల్సి ఉంది. అయితే, ఆయన కరోనాతో మృతి చెందడంతో ఇది సాధ్యమయ్యే పని కాదని తెలుస్తోంది. అంతేకాదు, ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు కానీ, మరొకరికి కానీ అప్పగించే అవకాశం కూడా లేదని సమాచారం.