Gaddi Thintava: 'పవర్ స్టార్' చిత్రం నుంచి 'గడ్డి తింటావా' పాట రిలీజ్ చేసిన వర్మ

Varma released Gaddi Thintava song from Power Star
  • పవర్ స్టార్ చిత్రం తెరకెక్కించిన వర్మ
  • జూలై 25న ఓటీటీలో రిలీజ్
  • ఇప్పటికే రేట్లు ప్రకటించిన వర్మ
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'పవర్ స్టార్' చిత్రం నుంచి 'గడ్డి తింటావా' అనే పాట రిలీజైంది. వర్మ ' ఆన్ లైన్ లో ఈ పాట విడుదల చేసిన అనంతరం సోషల్ మీడియాలో వెల్లడించారు. పక్కా సెటైరికల్ గా ఉన్న ఈ పాట బాణీ కంటే భావమే ప్రధానంగా సాగింది. కాగా, పవర్ స్టార్ చిత్రాన్ని జూలై 25న తన 'ఆర్జీవీవరల్డ్ థియేటర్ డాట్ కామ్' వెబ్ సైట్లో రిలీజ్ చేసేందుకు వర్మ సన్నాహాలు చేస్తున్నాడు. వర్మ ఇప్పటికే ట్రైలర్ తో సహా సినిమాకు కూడా ఓటీటీ రేట్లు ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.
Gaddi Thintava
Power Star
RGV
Ram Gopal Varma
OTT

More Telugu News