మీ అందరి సందేశాలను చదవాలనుకుంటున్నాను: వైఎస్ షర్మిల

19-07-2020 Sun 17:20
  • 'నాలో.. నాతో... వైఎస్సార్' పుస్తకం రాసిన విజయమ్మ
  • భర్త వైఎస్సార్ జ్ఞాపకాల నేపథ్యంలో పుస్తకం
  • ఇటీవలే పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
YS Sharmila responds on the book written by YS Vijayamma

ఇటీవలే వైఎస్సార్ అర్ధాంగి వైఎస్ విజయమ్మ తన భర్త జ్ఞాపకాల నేపథ్యంలో 'నాలో.. నాతో... వైఎస్సార్' అనే పుస్తకాన్ని రచించారు. ప్రస్తుతం ఈ పుస్తకం మార్కెట్లో ఉంది. ఇటీవలే వైఎస్సార్ జయంతి సందర్భంగా సీఎం జగన్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తాజాగా ఈ పుస్తకంపై వైఎస్సార్ తనయ వైఎస్ షర్మిల స్పందించారు. "అమ్మ రాసిన పుస్తకం 'నాలో.. నాతో... వైఎస్సార్' పట్ల మీ అందరి అపూర్వ స్పందన మాకు దక్కిన విశిష్ట గౌరవంగా భావిస్తున్నాం. ఆ పుస్తకంపై మీ స్పందనలను కామెంట్ల రూపంలో పంపించండి. మీ సందేశాలన్నింటినీ చదవాలనుకుంటున్నాను" అంటూ షర్మిల ట్వీట్ చేశారు.