నాతో కుస్తీకి ఎవరైనా సిద్ధమా? ... వికాస్ దూబే పాత వీడియో వైరల్

  • ఎనిమిది మంది పోలీసులను బలిగొన్న గ్యాంగ్ స్టర్
  • ఇటీవలే ఎన్ కౌంటర్ లో హతుడైన దూబే
  • నిక్కరు,బనియన్ పై వీడియోలో దర్శనం
Vikas Dubey challenges for a wrestling fight

ఇటీవలే ఎన్ కౌంటర్ లో హతుడైన కరడుగట్టిన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేకు చెందిన ఓ పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నిక్కరు, బనియన్ పై ఉన్న వికాస్ దూబే... నాతో కుస్తీ పట్టే వస్తాదు ఎవరైనా ఉన్నారా అంటూ సవాల్ విసరడం ఆ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను ఓ ఫోన్ కెమెరాతో రికార్డు చేసినట్టు తెలుస్తోంది.

తన స్వగ్రామంలోని నివాసం వద్ద ఈ సరదా చాలెంజ్ చేసినట్టు అర్థమవుతోంది. కొన్నివారాల కిందట ఎనిమిది మంది పోలీసులను బలిగొన్న వ్యవహారంలో, తనను పోలీసులకు వెదుకుతుండగా దూబే ఉజ్జయిన్ లో లొంగిపోయాడు. అక్కడి నుంచి కాన్పూర్ తీసుకువచ్చే క్రమంలో కారు బోల్తాపడగా, పోలీసులపై కాల్పులు జరిపేందుకు దూబే ప్రయత్నించాడని, దాంతో ఆత్మరక్షణ కోసం అతడ్ని కాల్చేశామని పోలీసులు చెబుతుండడం తెలిసిందే.


More Telugu News