తిరుపతి ఎయిర్ పోర్టులో తృటిలో ప్రమాదం తప్పించుకున్న ఇండిగో విమానం

19-07-2020 Sun 14:10
  • రన్ వేపై బోల్తాపడిన ఫైరింజన్
  • చివరి నిమిషంలో గుర్తించిన అధికారులు
  • తిరిగి బెంగళూరు వెళ్లిపోయిన విమానం
Indigo plane escapes an danger at Tirupati airport

తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో ఇండిగో విమానానికి ముప్పు తప్పింది. బెంగళూరు నుంచి 71 మంది ప్రయాణికులతో వచ్చిన ఈ విమానం ల్యాండింగ్ కు సన్నద్ధమవుతున్న తరుణంలో రన్ వేపై ఓ ఫైరింజన్ బోల్తాపడింది. చివరి నిమిషంలో ఈ విషయం గుర్తించిన అధికారులు వెంటనే ఇండిగో విమాన పైలెట్ ను అప్రమత్తం చేశారు. ఆ విమానం మళ్లీ గాల్లోకి లేచింది. దాంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. ఫైరింజన్ ను తొలగించేందుకు సమయం పడుతుందన్న నేపథ్యంలో ఆ విమానాన్ని తిరిగి బెంగళూరుకు మళ్లించారు.