తెనాలి ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
- కరోనా బారినపడిన అన్నాబత్తుని శివకుమార్
- ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని వెల్లడి
- అందరికీ ఫోన్ లో అందుబాటులో ఉంటానన్న ఎమ్మెల్యే
దీనిపై ఎమ్మెల్యే శివకుమార్ స్పందిస్తూ, ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. తాను అందరికీ ఫోన్ లో అందుబాటులోనే ఉంటానని వెల్లడించారు. అవసరం అయితే తప్ప ఎవరూ ఇళ్లలోంచి బయటికి రావొద్దని, కరోనా పట్ల నిర్లక్ష్యం కూడదని పిలుపునిచ్చారు. తెనాలిలో మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ సహా అనేకమంది అధికారులు, పోలీసులు కరోనా బారినపడడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.