Tamil Nadu: చనిపోయేందుకు రావాలని దెయ్యం పిలిచింది.. అందుకే: సూసైడ్ లేఖలో నర్సింగ్ విద్యార్థిని

Nursing Student commit suicide in Tamil Nadu
  • తమిళనాడులోని దిండుక్కల్ జిల్లాలో ఘటన
  • రెండు రోజుల క్రితమే పుట్టిన రోజు జరుపుకున్న యువతి
  • తనను చంపేస్తానని దెయ్యం బెదిరించిందంటూ లేఖ
చనిపోయేందుకు రావాలని దెయ్యం పిలుస్తోందని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరిస్తోందని లేఖ రాసిన ఓ నర్సింగ్ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడులో జరిగిందీ ఘటన. దిండుక్కల్ జిల్లా వేడచందూర్‌లోని ఓ గ్రామానికి చెందిన యువతి కోయంబత్తూరు వైద్య కళాశాలలో నర్సింగ్ చదువుతోంది. లాక్‌డౌన్ కారణంగా ఇటీవల ఇంటికి చేరుకున్న యువతి రెండు రోజుల క్రితం పుట్టిన రోజు వేడుకలు కూడా చేసుకుంది.

ఆ తర్వాతి నుంచి మౌనంగా మారిపోయింది. ఇంట్లో ఎవరితోనూ మాట్లాడడం మానేసింది. శుక్రవారం రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీ చేయగా సూసైడ్ నోట్ కనిపించింది. అందులో ఆమె రాసిన విషయాలను చదివి విస్తుపోయారు.

తన ఆత్మహత్యకు దెయ్యమే కారణమని పేర్కొంది. రాత్రుళ్లు నిద్రపట్టడం లేదని, చనిపోయేందుకు రావాలంటూ దెయ్యం తనను పిలుస్తోందని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని భయపెడుతోందని ఆ లేఖలో వాపోయింది. ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tamil Nadu
Devil
Suicide
Nursing Student

More Telugu News